30న హరిపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం

మండలంలో హరిపురం ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ఉద్దానం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30న రాగోలు జెమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

Update: 2019-11-28 09:28 GMT

మందస: మండలంలో హరిపురం ప్రాధమిక ఉన్నత పాఠశాలలో ఉద్దానం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 30న రాగోలు జెమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

ఈ వైద్య శిబిరంలో మానవునిలో ఉన్న అన్నిరకాల సాధారణ వ్యాదులను ఉచితంగా తనిఖీ చేసి, మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అలాగే ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారు. హరిపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్దానం సేవా సమితి ప్రతినిధులు కోరారు.

Tags:    

Similar News