Free Bus Scheme: సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సు.. ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Free Bus Scheme: ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-12-10 09:22 GMT

Free Bus Scheme: సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సు..

Free Bus Scheme: ఏపీ మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియాలో తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ హామీని సంక్రాంతి నుంచి ప్రారంభించనుంది.

మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు.. బస్సుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని విధానాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. కానీ అప్పుడు కుదరకపోవడంతో సంక్రాంతి వరకు ఈ హామీని అమలు చేయాలని భావిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది. ఎన్ని బస్సులు అవసరం, రోజుకు ఎంతమంది ప్రయాణిస్తారు. ఏ విధంగా అమలు చేయాలి వంటి విషయాలను ప్రభుత్వం అధికారులతో చర్చించింది. ఇక మొత్తం ఓ అంచనాకి వచ్చిన తర్వాతనే ఈ పథకాన్ని మొదలుపెట్టాలని భావించింది. 

Tags:    

Similar News