ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం
Rajya Sabha: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం
Rajya Sabha: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు YCP కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందించారు. ముఖ్యమంత్రి జగన్ అజెండా మేరకు పనిచేస్తామని కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.