Chittoor Road Accident: ప్రాణాలు తీసిన ఓవర్ టేకింగ్.. నలుగురు మృతి, మరో 14మందికి గాయాలు
Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నగరి సమీపంలో తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది.
Chittoor Road Accident: ప్రాణాలు తీసిన ఓవర్ టేకింగ్.. నలుగురు మృతి, మరో 14మందికి గాయాలు
Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నగరి సమీపంలో తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది..ప్రమాదంలో నలుగురు చనిపోగా 14మందికి గాయాలయ్యాయి. తమిళనాడు అరక్కోణం నుంచి ప్రైవేట్ బస్సు తిరుపతికి బయల్దేరింది. నగరి సమీపంలో బస్సు డ్రైవర్ మరో వాహానాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో పుత్తూరు నుంచి ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది.
లారీని చూసి సడన్ బ్రేక్ వేయడంతో బస్సు అదుపు తప్పింది. మధ్య భాగంలో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తిరుపతి జిల్లా వడమాల మండలం సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారథి నాయుడు , రాజేంద్రనాయుడు, తిరుపతికి చెందిన మణిగండ, ధనూష్ అక్కడికక్కడే చనిపోయారు. మరో 14 మందికి గాయపడ్డారు. గాయపడిన వారిలో తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిని వారిని చికిత్స నిమిత్తం నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.