Ambati Rambabu: లిక్కర్ స్కాం.. ఓ కట్టుకథ..

Ambati Rambabu: కూటమి ప్రభుత్వం తమ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'లిక్కర్ స్కాం' అనే కట్టుకథను అల్లిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఆరోపించారు.

Update: 2025-09-12 10:40 GMT

Ambati Rambabu: లిక్కర్ స్కాం.. ఓ కట్టుకథ..

Ambati Rambabu: కూటమి ప్రభుత్వం తమ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే 'లిక్కర్ స్కాం' అనే కట్టుకథను అల్లిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.

మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, లిక్కర్ స్కాం విచారణలో సిట్ (SIT) పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. "కేసులు పెట్టిన వెంటనే కీలకమైన ఆధారాలు ఉన్నాయంటారు. మరి ఆ ఆధారాలు ఏవి? ఎందుకు వాటిని కోర్టుకు సమర్పించడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటివరకు కనీసం ఛార్జ్‌షీట్‌ కూడా ఫైల్ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

"లేని స్కాంను సృష్టించడం వల్లనే సిట్‌ విచారణ ముందుకు సాగడం లేదు. కోర్టు ఆధారాలను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగం" అని అంబటి రాంబాబు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 'డైవర్షన్ పాలిటిక్స్'లో భాగంగానే తమ నాయకులను కేసుల్లో ఇరికిస్తోందని ఆయన అన్నారు.

Tags:    

Similar News