విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరోసారి అగ్ని ప్రమాదం

Fire Accident: హార్బర్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఎగిసిన మంటలు

Update: 2023-12-01 01:45 GMT

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరోసారి అగ్ని ప్రమాదం

Fire Accident: విశాఖ నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో గురువారం మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హార్బర్‌లోని గాంధీ విగ్రహం వద్ద మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 40కిపైగా బోట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనను మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Tags:    

Similar News