Pulivendla: రైట్స్ ఆధ్వర్యంలో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ

పట్నంలో రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ స్థానిక సీఎస్ఐ చర్చి ఆవరణంలో పులివెందల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

Update: 2020-02-08 07:04 GMT

పులివెందుల: పట్నంలో రైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ స్థానిక సీఎస్ఐ చర్చి ఆవరణంలో పులివెందల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబం, సమాజం దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ప్రతి మహిళా ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి సాధించాలని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా డైరెక్టర్ త్యాగరాజు మాట్లాడుతూ రైట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మహిళ అభివృద్ధి అని, మహిళ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం ఆర్ధికంగా బలోపేతం అవుతుందని అన్నారు. ప్రతి మహిళ ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో ముకుందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News