Harsha Kumar: పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు
Harsha Kumar: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Harsha Kumar: పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు
Harsha Kumar: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్ ఏపీ మంత్రిని పట్టుకుని సన్యాసి అనడం తిరిగి ఆ మంత్రి దూషించడం అనేది అంతా ఒక గేమ్ అని మండిపడ్డారు.
పవన్, పోసానిలను పార్టీలు పావులుగా వాడుకుంటున్నారని వెల్లడించారు. కాకినాడ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతోందని ఆరోపించారు.
డ్రగ్స్ మాపియాలో కాకినాడకు చెందిన ప్రజాప్రతినిది ఉన్నారని తెలిపారు. కాకినాడ పోర్టులో ఆయిల్ మాపియా, డ్రగ్స్ మాపియాల్లో కాకినాడ ప్రజాప్రతినిధి ఉన్నారని చెప్పారు. డ్రగ్స్ మాపియా యుద్ధం కన్నా, కరోనా కన్నా చాలా ప్రమాదమని ఆయన చెప్పుకొచ్చారు. ఎర్ర చందనం, గంజాయి అక్రమ రవాణాలో ఉన్న రాజకీయ పార్టీల నేతల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.