విషాదంలో వైసీపీ నేతలు.. సీనియర్ నేత మృతి..

Update: 2019-05-11 06:26 GMT

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత బూచేపల్లి సుబ్బారెడ్డి మృతిచెందారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 2004 లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఆ తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ లో చేరారు. సుబ్బారెడ్డి దర్శి నియోజకవర్గానికి ముక్యంగా తాగు, సాగునీరు అందించడానికి తీవ్రంగా కృషిచేశారు.

ఆయన భార్య వెంకాయమ్మ చీమకుర్తి మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు.. పెద్దకుమారుడు కమలాకర్ రెడ్డి సినీ హీరో, ఆయన 2013 లో మృతిచెందారు. అభి, సంచలనం, హాసిని, బ్యాండ్ బాలు చిత్రాల్లో హీరోగా నటించారు. ఇక రెండో కుమారుడు శివప్రసాద్ రెడ్డి 2009 లో దర్శి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో బూచేపల్లి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఆయన మృతితో వైసీపీ నేతలు విషాదంలో మునిగిపోయారు. సుబ్బారెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే వైసీపీ అధినేత వైయస్ జగన్ బూచేపల్లి కుటుంబసభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రేపు జగన్ దర్శికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. 

Similar News