ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ

హైదరాబాద్ కొండాపూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2022-05-10 06:46 GMT

ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ

Narayana Arrest: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. పదో తరగతి ప్రశ్నపత్నాల లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో వరుసగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ కేసులో పలువురు ఉపాధ్యాయులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు నుంచి వచ్చిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నారాయణను చిత్తూరుకు తరలిస్తున్నారు.

పదో తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌లో టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ వెలుగులోకి వచ్చింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఉదయం పరీక్ష ప్రారంభమైన వెంటనే గిరిధర్ వాట్సప్ నంబర్ నుంచి తెలుగు ప్రశ్నా పత్రం బయటకు వెళ్లిందని పోలీసులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9.57కి ప్రశ్నాపత్రం లీకైందన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే గిరిధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

కాగా, టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షా పత్రాలు లీకేజీలో మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన విద్యాసంస్థల పాత్ర ఉందని ఆరోపించారు. అలాగే, పరీక్షా పత్రాల లీకేజీపై కఠినంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను సైతం ఆదేశించారు. దీంతో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ప్రశ్నా పత్రాల లీకేజీలో నారాయణ విద్యా సంస్థల పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు.. తాజాగా, ఆ సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నారాయణతో పాటు ఆయన సతీమణి రమాదేవి కూడా చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నారాయణ సొంత బెంజ్ కారు 8888 లోనే పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు.

మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని నివాసంలో నారాయణను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. పదో తరగతి ప్రశ్నపత్నాల లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ.. నారాయణను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీలో వరుసగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ఈ కేసులో పలువురు ఉపాధ్యాయులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News