ఆది వెంట వారు కూడా వెళతారా?

Update: 2019-08-22 05:34 GMT

ఆదినారాయణరెడ్డి.. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. కాంగ్రెస్ తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్ బ్రతికున్న రోజుల్లో కడప జిల్లాలో తిరుగులేని నేత. ఆ తరువాత జగన్ చెంతకు చేరినా.. వ్యక్తిగత కారణాలతో టీడీపీకి జై కొట్టారు. కానీ సీన్ రివర్స్ అయింది. టీడీపీనుంచి పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడారు.. దాంతో భవిశ్యత్ పై బెంగ పట్టుకుంది. ఓ వైపు వైసీపీ నేతల అలజడి, మరోవైపు సొంత పార్టీలో గ్రూపు రాజకీయాలతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆదిపై అంతగా ఆసక్తి కనబరచడం లేదట.. ఒకవేళ తనతోపాటు ఒకరిద్దరు పెద్దతలకాయలను తీసుకొస్తే ఆలోచిస్తామని ఆదికి హింట్ ఇచ్చారట.

దాంతో టీడీపీలోని అసంతృప్తి నేతల్ని కదిలిస్తున్నారట ఆది. అందులో బద్వేల్, ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఉండే నేతలతో మాట్లాడారట. ఒకరిద్దరు సై అన్నా .. చేరే సమయానికి మాత్రం హ్యాండ్ ఇస్తున్నారట. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డిని సంప్రదిస్తే తాను తన కుమారుడితోపాటు వైసీపీలో చేరతానని తెగేసి చెప్పారట. అటు ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల లతో మాట్లాడితే బీజేపీలో ఉన్న సీఎం రమేష్ తో తమకు వైరం ఉందని చెబుతున్నారట. మరి వీరు కాక ఆదినారాయణరెడ్డి వెంట వేరే వారు వెళతారా? వెళితే ఎవరు వెలతారోనన్న ఆసక్తికర చర్చ జిల్లాలో మొదలయింది. 

Tags:    

Similar News