Kiran Kumar Reddy: త్వరలో బీజేపీ గూటికి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: కాంగ్రెస్ పార్టీని కిర‌ణ్ కుమార్ వీడనున్నట్టు సమాచారం

Update: 2023-03-11 05:03 GMT

Kiran Kumar Reddy: త్వరలో బీజేపీ గూటికి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రిగా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా ఆయన తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌గా ఉండబోతున్నారని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ.. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ... కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిన... కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా... యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ ఎలాంటి పదవిని అప్పగిస్తుందనేది చర్చగా మారింది. అసలు ఆయనకు తెలంగాణలో సపోర్ట్ లభిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. రాయలసీమలో బీజేపీ వ్యూహాల కోసం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ కీలక నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి రెండు దఫాలుగా జరిపిన చర్చలు ఫలించడంతోనే ఆయన కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News