కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: బెహరా భాస్కరరావు
ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరరావు అన్నారు.
గోపాలపట్నం: ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరరావు అన్నారు. జీవీఎంసీ 91,92 వార్డుల సచివాలయాల్లో సిబ్బంది వాలంటీర్లకు 400 మాస్కులు, వాష్ బుల్ గ్లోవ్స్ ను ఎస్.ఎస్.కన్స్ట్రక్షన్స్ అధినేత శరగడం సురేష్ మరియు కేడియం బిల్డర్స్ అధినేత తాళాసు వైకుంఠరావు ఆర్థిక సహాయంతో వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భాస్కర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ని ప్రతి ఒక్కరూ అమలుచేసి కరోనా వైరస్ ని తరిమి కొట్టాలని కోరారు. అందరూ ఇంట్లోనే ఉండాలని, ఏదైనా అవసరానికి బయటకు వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ అప్పలస్వామి నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గునిశెట్టి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.