ESI Scam in AP: మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్‌

ESI Scam in AP: ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది.

Update: 2020-07-10 10:00 GMT
Representational Image

ESI Scam in AP: ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ మరింత దూకుడు పెంచింది. ఇప్ప‌టికే మాజీ మంత్రి అచ్చెనాయుడు స‌హా ప‌ది మంది ఈ కేసులో అరెస్టైన విష‌యం అందరికి తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు మ‌రొక‌రిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ వ‌ద్ద‌ పీఎస్‌గా ప‌నిచేసిన ముర‌ళీ మోహ‌న్ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఆంధ్రసప్రదేశ్ స‌చివాల‌యంలో వద్ద ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముర‌ళీ మోహ‌న్ ప్ర‌స్తుతం స‌చివాలయంలోని మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలలో విధులు నిర్వ‌హిస్తున్నారు.

దీంతో ఈఎస్ఐ కుంభకోణం కేసులు అరెస్టుల సంఖ్య 11 కు చేరింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మొదట కింజరాపు అచ్చెనాయుడు ఆ త‌ర్వాత పితాని స‌త్య‌నారాయ‌ణ కార్మిక శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఇదిలావుంటే ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న అచ్చెన్నాయుడు సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను ఇటీవల కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు గ‌త శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టిన సంగతి తెలిసిందే.. అధికారులు చెబుతున్న దాని ప్రకారం గత ఆరేళ్లలో రూ.కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నిర్ధారించారు. ఈఎస్‌ఐ లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది.


Tags:    

Similar News