పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
Elephants: రావికర్రవలసలో ఏనుగుల దాడిలో రెండు ఎడ్లు మృతి.. మరో ఆవుకు తీవ్రగాయాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
Elephants: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రావికర్రవలసలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో రెండు ఎడ్లు మృతి చెందగా ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎడ్లు మృతి చెందడానికి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు అటవీశాఖ అధికారులను బంధించారు. జిల్లా నుంచి ఏనుగులను తరలించే వరకు అటవీ శాఖ సిబ్బందిని విడిచిపెట్టబోమంటూ గ్రామస్తులు ఆందోళన జరిపారు.