Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులగుంపు బీభత్సం

Parvathipuram: అటవీశాఖ ట్రాకర్‌ లక్ష్మీనారాయణపై ఏనుగుల దాడి

Update: 2023-02-07 08:00 GMT

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులగుంపు బీభత్సం

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పసుకుడి గ్రామంలోకి ఏనుగుల గుంపును రానివ్వకుండా అటవీశాఖ ట్రాకర్ లక్ష్మీనారాయణ విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఏనుగుల గుంపు గ్రామంలోకి రావడంతో వాటిని ఎగువకు మళ్లించే ప్రయత్నం చేశారు ట్రాకర్ లక్ష్మీనారాయణ. దీంతో వెనక నుండి ఏనుగు ట్రాకర్ పై దాడి చేసింది. వరుసగా ఏనుగుల గుంపు ట్రాకర్ పైకి ఎక్కడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల గుంపు సంచారంతో సమీప గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఘటనా స్థలానికి అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News