AP News: ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లపై ఈసీ వేటు

AP News: ఐదుగురు గ్రామ వాలంటీర్లపై వేటు వేసిన ఈసీ

Update: 2024-03-24 07:08 GMT

AP News: ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లపై ఈసీ వేటు 

AP News: ఎన్నికల వేళ వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్ మండలాల్లోని గ్రామాల్లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. గడేకల్లుకు చెందిన గ్రామ వాలంటీర్లు హేమంత్, సురేశ్, మహేశ్, భీమరాజు, విడపనకల్లుకు చెందిన బసవరాజు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలు వాలంటీర్ల గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈసీ కొరఢా ఝుళిపించారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ చేపట్టాలని కలెక్ట్‌కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో ఎంపీడీఓ కొండయ్య, పంచాయతీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. వైసీపీ ఆవిర్బావ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికారుల విచారణలో తేలింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఐదుగురు గ్రామ వాలంటీర్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా గ్రామ వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీఓ కొండయ్య ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News