Godavari Pushkaralu: అదిగదిగో గోదావరి.. పుష్కరాల డేట్ అవుట్.. ఎప్పుడంటే?
Godavari Pushkaralu: భారతదేశంలో నదులకు నిర్వహించే పుష్కరాలకు ఓ ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.
Godavari Pushkaralu: అదిగదిగో గోదావరి.. పుష్కరాల డేట్ అవుట్.. ఎప్పుడంటే?
Godavari Pushkaralu: భారతదేశంలో నదులకు నిర్వహించే పుష్కరాలకు ఓ ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక పన్నేండేళ్లకోసారి వచ్చే నదుల పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరిస్తే దేవదేవుని ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయని..ఆ గంగమ్మ జలాన్ని శిరస్సుపై నుంచి వేసుకుంటే సమస్యలు తొలగిపోవడంతోపాటు పాపాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
అయితే దేశవ్యాప్తంగా ఎన్నో నదులు సంగమాలకు సంబంధించిన పుష్కరాలు జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే గోదావరి తల్లి పుష్కరాలు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. రాష్ట్రం దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు గోదావరి ప్రాంతానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరిస్తుంటారు. ముఖ్యంగా గోదావరి అంటే అందాలకు పెట్టింది పేరు. ఇక్కడ పుష్కరాలు అంటే ఆ అందాలు మరింత పెరుగుతుంటాయి. అలాంటి నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించడం అన్నింటికీ శుభం అంటూ పెద్దలు చెబుతారు. అలాంటి పుష్కరాలు రాజమండ్రి గోదావరి దగ్గర ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో తెలుసుకుందాం.
రాజమండ్రిలోని అన్ని ఘాట్ల దగ్గర లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం పుణ్యస్నానాలు గంగమ్మ నమోస్తుతే అంటూ ఆచరిస్తుంటారు. అలాంటి పుష్కరాలు 12ఏళ్లకు ఒకసారి గోదావరికి సంబంధించి నిర్వహిస్తుంటారు. ఇక ప్రస్తుతం 2027 జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పుష్కరాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం తేదీలను ప్రకటించింది. 2ఏళ్ల ముందే ఈ తేదీలు ప్రకటించింది.