Durga Temple Governing Body Meeting: ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

Update: 2020-07-30 10:21 GMT
విజయవాడ దుర్గ ఆలయం

Durga Temple Governing Body Meeting : కరోనా బారిన పడిన దుర్గదేవి ఆలయ సిబ్బందిని ఆలయ పరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నామని దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇందుకోసం డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేసారు.

అనంతరం ఆయల ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ 38 అంశాలపై పాలకమండలి సమావేశం లో చర్చించామని ఆయన తెలిపారు. శివాలయం రీ కన్స్ట్రక్షన్, అన్నదానం, ప్రసాదం పొటు., కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే వచ్చాయని ఆయన స్పష్టం చేసారు. అదే విధంగా తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఆలయంలో విధులునిర్వహించే సిబ్బంది కి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామని ఆయన హామీ ఇచ్చారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావొచ్చని ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయం లో మార్పులు చేస్తామని ఆయన తెలిపారు.



Tags:    

Similar News