ఉగ్ర గోదారి..జలదిగ్బంధంలో 22 గ్రామాలు

Update: 2019-08-03 05:51 GMT

గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉంటంతో 22 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం దగ్గర వరద నీరు భారీగా చేరుతూ ఉండటంతో 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.34 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా...9.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్ట వద్ద ప్రస్తుతం 11.2 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ఉండటంతో సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

Full View

Tags:    

Similar News