సజ్జల భార్గవ్ రెడ్డిని 2 వారాలు అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశం..
Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డిని రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సజ్జల భార్గవ్ రెడ్డిని 2 వారాలు అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశం..
Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డిని రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా(Social Media)లో పోస్టుల వ్యవహారంలో తనపై నమోదైన తొమ్మిది కేసులను కొట్టివేయాలని భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. భార్గవ్ పిటిషన్ పై పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వర్రా రవీందర్ రెడ్డిని విచారించిన సమయంలో భార్గవ్ రెడ్డి నుంచి తమకు అందిన కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టుగా ఆయన చెప్పారని సమాచారం. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.