గ్రామా సచివాలయంను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మండల కేంద్రంలోని రాజుపాలెం రామకృష్ణాపురం కిర్లంపూడి గ్రామాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పర్యటించారు.

Update: 2019-12-12 07:57 GMT
జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

కిర్లంపూడి: మండల కేంద్రంలోని రాజుపాలెం రామకృష్ణాపురం కిర్లంపూడి గ్రామాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పర్యటించారు. ఈ మూడు గ్రామాల్లో గ్రామ సచివాలయలను ఆయన పరిశీలించారు. వాలంటీర్లు అందరికీ బాధ్యతతో పని చేయాలని సూచించారు జగపతినగరం గ్రామ సర్పంచ్ పెంటకోట నాగబాబు సొసైటీ అధ్యక్షులు చదలవాడ బాబి కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సచివాలయం పకడ్బందీగా నిర్వహిం చాలని ఎంపీడీవో ఎమ్మార్వో లకు తెలియజేసారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు కిర్లంపూడి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.

గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నామనీ గతంలో ఎల్లపు నరసయ్య సత్రం భూమిలో అప్పటి మంత్రి వర్యులు తోట నరసింహం విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు ఆర్థిక ఇబ్బందులు రీత్యా గతంలో ఇల్లు నిర్మించుకో లేక పోయామని ఆ స్థలాలలో కొంతమంది గడ్డి మెట్లు కళ్ళు పాకలు నిర్మించారని వాటిని తొలగించి మాకు ప్రభుత్వాలు కేటాయించిన స్థలాలు మంజూరు చేయవలసినదిగా కోరుతూ విలేఖర్ల కలిసి వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ ఎం ఆర్ ఓ ఎం డి ఓ గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News