Anakapalli: అప్పన్నకు దారేది? అనకాపల్లి ఆలయం వివాదంలో చిక్కుకుంది!
వివాదంలో అనకాపల్లిలో అప్పన్న ఆలయం ఐదు రోజులుగా చీకటిలో వరాహలక్ష్మీనరసింహస్వామి
Anakapalli: అప్పన్నకు దారేది? అనకాపల్లి ఆలయం వివాదంలో చిక్కుకుంది!
అనకాపల్లిలోని గవరపాలెం దిబ్బవీధిలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయం వివాదంలో చిక్కుకుంది. పట్టాభిదాసుడిచే పూర్వ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం నిర్వహణపై కొందరు వ్యక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఐదు రోజులుగా స్వామివారికి పూజలు నిలిచిపోయాయి. ఈ ఆలయాన్ని పట్టాభిదాసుడు నిర్మించిగా.. ప్రస్తుతం ఆయన ఐదవ తరం మనవడు సొంత ఖర్చులతో మంచి-చెడ్డలు చూసుకుంటూ, పూజాధికాలు నిర్వహిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఈ ఆలయంపై కన్నేసి.. ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే గుడిలోకి ప్రవేశించే కొబ్బరితోటకు తాళాలు వేశారు. దీంతో 5 రోజులుగా స్వామివారకి దూప దీప నైవేధ్యాలు అగిపోయాయి. ఆలయంలోకి ప్రవేశం లేకపోవడంతో, భక్తులు రోడ్డుపైనే పూజలు నిర్వహించారు. ఈ సమస్యపై గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని.. వివాదాన్ని పరిష్కరించి స్వామివారికి తిరిగి పూజాధికాలు జరిగేలా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.