తిరువూరు పోలీసుస్టేషన్ ను తనిఖీ చేసిన డి .ఐ .జి

పట్టణంలోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి-ఎ ఎస్ ఖాన్. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

Update: 2019-11-27 12:42 GMT
డిఐజి ఎ.ఎస్ ఖాన్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది

తిరువూరు: పట్టణంలోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి-ఎ ఎస్ ఖాన్. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెక్ పోస్ట్ లు యందు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామని, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, పోలీసులు ప్రజలతో మమేకమయునందుకు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

ఫిర్యాదులు చేసినా బాధితలకు సత్వర న్యాయం చేకూర్చుతున్నాము అని, రోడ్డు ప్రమాదలు జరగకుండా వాహన దారులకు ఆవగహన కార్యక్రమాలు చేపడుతున్నామని, అక్రమంగా ఇసుక సరఫరా చేస్తే రెండు సంవత్సరాల జైలు చికిత్స పడుతుందని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడేవారేనని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీక్లి ఆఫ్ పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.


 

Tags:    

Similar News