75 ఏళ్లుగా వన్నె తగ్గని ధనుర్మాస మహోత్సవాలు
రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహణకు సుముహూర్తం కాలం సమీపించింది.
గుడివాడ: రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు నిర్వహణకు సుముహూర్తం కాలం సమీపించింది. ఈరోజు నుండి ఉత్సవాల నిర్వహణకు వేద పండితులు ముహూర్తాలు ఖరారు చేశారు. అందుకు సంబంధించిన విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుడివాడలో సుమారు 75 సంవత్సరాల కు పైగా క్రమం తప్పకుండా నిరాటంకంగా ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తున్న ఘనత గుడివాడ పట్టణ వాసులకు దక్కింది.
పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో కోదండ రామాలయం వద్ద ప్రతియేటా భారీగా వేసిన చలువ పందిళ్ళులో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పట్టణానికి చెందిన లారీ యజమానులు, ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం నిర్వాహకులు, వర్కర్లు భక్తులు ఆలయ సమీపం లోని షాపుల యజమానులు అందరి సమిష్టి కృషితో ఈ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రాశస్త్యం పొందేలా నిర్వహిస్తున్నారు.
ఆలయ అర్చక స్వాములు అగ్నిహోత్రం శ్రీకాంత్ వేదపండితులు ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన వేదపండితులు స్వర్ణ ప్రసాద్ ఆధ్వ ర్యంలో ప్రతినిత్యం పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన ఆంధ్ర రాకెట్ బిరుదాంకితులు కీllశేll ముదపాక అప్పలాచార్య భగవతార్, ధనుర్మాస పందిరిలో తుదిశ్వాస విడిచేంతవరకు ప్రతియేటా హరి కథా గానం చేశారు.ప్రతి ఒక్కరూ ధనుర్మాస ఉత్సవాలు విజయవంతం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రాంబాబు విజ్ఞప్తి చేశారు.