Corona Effect: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో పలు ఆలయాలు బోసిపోతున్నాయి.

Update: 2020-03-16 13:01 GMT
Tirumala(File Photo)

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో పలు ఆలయాలు బోసిపోతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గి వెలవెలబోతుంది. సాధారణంగా వచ్చే భక్తులతో పోలిస్తే 30 శాతం మంది భక్తులు తగ్గినట్టుగా టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే కోరానా వ్యాప్తి చెందకుండా టీటీడీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి గదుల తేదీలు మార్పు చేసుకునే అవకాశంతో పాటు వాటిని రద్దు చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. అంతేకాకుండా భక్తులంతా మాస్కులు ధరించాలని సూచించింది.

ఇక దగ్గు, జ్వరం, జలుబు ఉన్నవారు 28 రోజుల పాటు తిరుమలకు రావొద్దని పేర్కొంది. ఒకవేళ అలాంటి లక్షణాలు కనిపిస్తే అలిపిరి, శ్రీవారి మెట్టు వద్ద థర్మో స్క్రీనర్ల ద్వారా స్క్రీనింగ్ చేస్తామని, అవసరమైతే వైద్య సాయం అందిస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మంగళవారం నుంచి టైం స్లాట్‌ టోకెన్లు జారీ చేయనున్నారు. దీంతోపాటు భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, వసంతోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక కరోనా వైరస్ రాకుండా తిరుమలలో భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లపైన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News