బొత్స ఏం మాట్లాడాడో ఐదు కోట్ల మంది ప్రజలకు అర్థం కాలేదు : దేవినేని ఉమ

జీఎన్ రావు రిపోర్టుపై బొత్స ఏం మాట్లాడారో ఐదు కోట్ల మంది ప్రజలకు అర్థం కాలేదని వ్యగ్యాస్త్రాలు సంధించారు.

Update: 2020-01-29 15:29 GMT
దేవినేని ఉమా ఫైల్ ఫోటో

జీఎన్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమ. జీఎన్ రావుకు కొంత దూరం నడిస్తేనే ఆయనకు విశ్రాంతి అవసరం అలాంటిది రాష్ట్రం మొత్తం ఎలా తిరిగారని ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం జగన్ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. జీఎన్ రావు రిపోర్టుపై బొత్స ఏం మాట్లాడారో ఐదు కోట్ల మంది ప్రజలకు అర్థం కాలేదని వ్యగ్యాస్త్రాలు సంధించారు.

మంత్రి బొత్స మాట్లాడిన తర్వాత జీఎన్ రావు రంగంలోకి దిగారు. ఆయన పది నిమిషాలు ఇంగ్లిష్ లో పది నిమిషాలు తెలుగులో మాట్లాడరని, అమరావతి రాకుండా హైదరాబాద్ లో కూర్చుని మాట్లారని ఎద్దేవా చేశారు. విశాఖలో రాజధాని 30 కిలోమిటర్లు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సూచిచారని నివేదికలో చెప్పారంట , సముద్రంలో ఏర్పాటు చేసుకోవాలా అని దుయ్యబట్టారు. విశాఖలో 150 కిలో మిటర్ల మేర గాలులు విస్తాయని హుదుద్ సృష్టించిన విధ్వసం మరవలేదని గుర్తు చేశారు.

విశాఖ రాజధాని అంటే నగర వాసులకు భయం పట్టుకుందంటున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని కొన్ని భూములను కొట్టేయడానికి ఆయన ప్లాన్ చేశారని దేవినేని ఉమ ఆరోపించారు.

 

Tags:    

Similar News