Destroying of illegal liquor in AP: ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం బాటిళ్ళ ధ్వంసం!

Destroying of illegal liquor in AP:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మొదటినుంచి మద్యపాన నిషేధం వైపుగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే..

Update: 2020-07-17 16:17 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మొదటినుంచి మద్యపాన నిషేధం వైపుగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల ప్రచారంలోనే రాష్ట్రవ్యాప్తంగా అంచలంచలుగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ హామీ ఇస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీలో మద్యం ధరలు మందుబాబులకి చుక్కలు చూపిస్తున్నాయి.

ఇక లాక్ డౌన్ సమయంలో పలు చోట్లలో మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతున్నాయి. అటు సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు కూడా అక్రమ మద్యం నిల్వలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొన్నిచోట్లల్లో అక్రమంగా మద్యాన్ని యథేచ్ఛగా తరలిస్తున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి.

అందులో భాగంగానే తాజాగా పట్టుబడ్డ భారీ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మచిలీపట్నం పోలీస్ గ్రౌండ్‌ ప్రాంతంలో దాదాపుగా రూ. 80 లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.. ఇక ఈ వీడియో పైన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

" మాట తప్పేది లేదు. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ గ్రౌండ్‌లో రూ.80 లక్షలు ఖరీదు చేసే 14,000 వేల అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన అధికారులు. అక్రమ మద్యం రవాణా తయారీకు పాల్పడుతున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు" అంటూ అయన ట్వీట్ చేశారు.



Tags:    

Similar News