Pawan Kalyan: ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: 77 డీడీవో కార్యాలయాల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Update: 2025-12-04 09:45 GMT

Pawan Kalyan: ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: 77 డీడీవో కార్యాలయాల ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం చిత్తూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 77 డీడీవో కార్యాలయాలను పవన్ కళ్యాణ్ ఇదే కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ఈ నూతన డీడీవో కార్యాలయాలు ప్రజలకు సేవలను వేగంగా అందించడానికి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు.

పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో భాగంగా, ఇటీవల 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం కోసం పంచాయతీరాజ్ విభాగానికి ప్రత్యేకంగా ఐటీ వింగ్‌ను (IT Wing) ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

Tags:    

Similar News