Pawan Kalyan: చిత్తూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా.. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా.. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్‌కు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా అధికారులు, జనసేన నేతలు, పవన్ అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ బయట ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్డుమార్గాన చిత్తూరుకు బయల్దేరారు డిప్యూటీ సీఎం పవన్. కాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా డీడీవో కార్యాలయాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. చిత్తూరు డీడీవోను స్వయంగా ప్రారంభించనున్నారు పవన్. మిగిలినవాటిని వర్చువల్‌గా ప్రారంభిస్తారు డిప్యూటీ సీఎం పవన్.