నా ప్రాణానికి హానీ జరిగితే అందుకు వారిద్దరే కారణం.. కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు..
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
నా ప్రాణానికి హానీ జరిగితే అందుకు వారిద్దరే కారణం.. కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు..
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనకు సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలతో ప్రాణహాని ఉందని ఎస్పీకి తెలిపాడు. భద్రత పెంచాలని ఎస్పీని దస్తగిరి కోరాడు. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం... సీఎం జగన్, అవినాష్ రెడ్డే అంటూ ఆరోపణలు చేశాడు. అవినాష్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దస్తగిరి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవినాష్ రెడ్డి అనుచరులు నన్ను అనుసరిస్తున్నారు. వారు నాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలి అని ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నారు.