చంద్రబాబుతో వైరం నిజమే: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Daggubati Venkateswara Rao: చంద్రబాబుతో వైరం ఉందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు.

Update: 2025-03-06 08:56 GMT

చంద్రబాబుతో వైరం నిజమే: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Daggubati Venkateswara Rao: చంద్రబాబుతో వైరం ఉందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి పురంధేశ్వరి, విశాఖ ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకం రాయడానికి దారి తీసిన పరిస్థితులను వెంకటేశ్వరరావు వివరిస్తున్న క్రమంలోనే చంద్రబాబు గురించి మాట్లాడారు.

చంద్రబాబుతో తనకు వైరం ఉందని అంటుంటారని అది నిజమేనని ఆయన అన్నారు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా.. గతంలో జరిగినవాటిని మర్చిపోతూ ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని దగ్గుబాటి ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే తనకు ఎలాంటి కోరికలు కూడా లేవని ఆయన అనగానే అందరూ నవ్వారు. తన కుటుంబం, తన పిల్లలు, స్నేహితులతో కలిసి క్షేమంగా ఉండాలనేది కోరిక అని ఆయన చెప్పారు.

1995లో టీడీపీ సంక్షోభం సమయంలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక వైపున ఉన్నారు. ఆ తర్వాతి పరిణామాల్లో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య అంతరం పెరిగింది. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీలలో చేరారు. 2023లో క్రియాశీల రాజకీయాలకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు.

Tags:    

Similar News