Weather Update: నేడు తీరం దాటనున్న వాయుగుండం..తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు..!!

Update: 2025-05-29 03:23 GMT

Weather Update: నేడు తీరం దాటనున్న వాయుగుండం..తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు..!!

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు కుమ్మేశాయి. నేడు వాయుగుండం తీరం దాటనుంది. దీంతో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయి. ఏపీ, తెలంగాణలో గురువారం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం భువనేశ్వర్ కు దగ్గరలో ఉంది. క్రమంగా బెంగాళ్ వైపుగా దూసుకెళ్తుంది.నేడు సాయంత్రానికి అది కోల్ కతాకు దగ్గరలోని హైదా దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. దీని వేగం గంటకు 50కిలోమీటర్లుగా ఉంది. సాయంత్రం నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది కోల్ కతా దగ్గర తీరం దాటినా దానిప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుంది. తీరం దాటినబలహీన పడుతుందో లేక మరింత బలపడుతుందో అప్పుడే చెప్పలేమని హైదరాబాద్ లోని వాతావరణశాఖ తెలిపింది.

నేడు, రేపు ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు చాలా చోట్లు కురుస్తాయని తెలిపింది. 29, 30 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో 29,30 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50కిలోమీటర్లుగా ఉంటుందని పేర్కొంది. నేడు రాయలసీమ, యానాం, కోస్తాంధ్రలో గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ..ఒక్కోసారి గంటకు 70కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నేడు ఏపీకి పిడుగులతో కూడా హెచ్చరికను జారీ చేసింది.

Tags:    

Similar News