Cyclone Montha: రైతు కంటకన్నీరు.. రాష్ట్రవ్యాప్తంగా 3,600 ఎకరాల్లో నేలకొరిన వరిపంట

Cyclone Montha: మొంథా తుఫాన్ ఏపీని కుదిపేసింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Update: 2025-10-29 06:41 GMT

Cyclone Montha: రైతు కంటకన్నీరు.. రాష్ట్రవ్యాప్తంగా 3,600 ఎకరాల్లో నేలకొరిన వరిపంట

Cyclone Montha: మొంథా తుఫాన్ ఏపీని కుదిపేసింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా వరిపంట నేలకొరిగింది. అరటి, మొక్కజొన్న, బొప్పాయి, తమలపాకు, కొబ్బరి, మామిడి, జీడి మామిడి తదిత పంటలకు నష్టం వాటిల్లింది. పొల్లాల్లో వరద నీరు ఉధృతంగా పొంగి పంటలు నీట మునిగాయి. పొలాలు, రహదారులు ఏకమై చెరువులను తలపిస్తున్నాయి.

చేతికొచ్చిన పంట నీటి పాలు కానవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి.. నీటిని తొలగించే మార్గాలు చేపట్టాలని.. పంట నష్టం నుంచి ఆదకోవాలని బాదితులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాలోనే రెండు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వెంకుపాలెం, తగరంపూడి, కూంచంగి, సీతానగరం గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.  

Tags:    

Similar News