అమరావతికి 18వేల కోట్లు సీఎంకు నివేదించిన సీఆర్‌డీఏ

Update: 2020-06-02 02:29 GMT
YS Jagan (File Photo)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వాటిని ప్రస్తుత అవసరాల మేరకు తగ్గించి పూర్తి చేయాలంటే 18 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వానికి సీఆర్‌డీఏ తేల్చింది. సోమవారం సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఆర్డీఏ నివేదించింది.చాలా రోజుల తరువాత ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

అమరావతిలో ప్రస్తుతం సాగుతున్న పనులను ఎంత మేరకు పరిమితం చేయాలి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? రివర్స్‌ టెండర్లు పిలవాలా? ప్రస్తుత కాంట్రాక్టర్లను కొనసాగించాలా? అనే అంశాలపై ఐఐటీతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఐఐటీ రూర్కె నుంచి వచ్చిన బృందం ఈ పనులను పరిశీలించారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వడం ఇతర పనులు పూర్తి చేయడం వంటి వాటిని పరిశీలించి ఆయా పనులు ఎంత మేర చేయాలో ఈ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ప్రభుత్వ వైద్య కళాశాలల భవన నిర్మాణాలపై సీఎం వైఎస్ జగన్‌ అధికారులతో సమీక్షలో నమూనాలు పరిశీలించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News