CPI Ramakrishna: ప్రధాని టూర్ తో ఏపీకి ఒరిగింది ఏమీ లేదు
CPI Ramakrishna: ప్రత్యేక హోదాపై మోదీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరం
CPI Ramakrishna: ప్రధాని టూర్ తో ఏపీకి ఒరిగింది ఏమీ లేదు
CPI Ramakrishna: ఏపీకి ప్రత్యేక హోదా ఆకాంక్షను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈమేరకు ఈనెల 26న ఢిల్లీలో ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో హస్తిన వేదికగా ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసనలకు సీపీఐ పార్టీ తరపన మద్దతు తెలిపి తాము ప్రత్యక్షంగా పాల్గొంటామన్నారు. ఒంగోలులో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రధాని టూర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వకపోగా ఉట్టి ముంత ఇచ్చిపోయారని సెటైర్ వేశారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కులపై ప్రధానికితో ప్రకటన చేయించకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రంగాల్లో కాదు.. అప్పులు చేయడంలో ఏపీని జగన్ ముందు వరుసలో నిలిపారని మండిపడ్డారు.