CPI Narayana: వైసీపీ మాఫియా పాలనకు నిదర్శనం

CPI Narayana: విశాఖ రాజధాని అనే మాట అభాసుపాలయింది-

Update: 2023-09-29 06:10 GMT

CPI Narayana: వైసీపీ మాఫియా పాలనకు నిదర్శనం

CPI Narayana: విశాఖలో 350 కోట్ల రూపాయల బెట్టింగ్ జరగడం వైసీపీ మాఫియా పాలనకు నిదర్శమన్నారు సీపీఐ నేత నారాయణ. విశా‌ఖ రాజధాని అనే మాట అభాసుపాలయిందని విమర్శించారు. విశాఖ కేంద్రంగా గంజాయి, బెట్టింగ్ దందా మొదలైందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకులే అన్ని మాఫియాలను సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ కేంద్రంగా వారిని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలో మద్యం మాఫియా కూడా పెరిగిందన్నారు నారాయణ.

Tags:    

Similar News