Visakhapatnam: కమిటీల పేరుతో కాలయాపన చేసి రైతులను మోసగించడం తగదు: సీపీఐ

అనకాపల్లి-తుమ్మపాల వి.వి.వి.రమణ సహకార చక్కెర కర్మాగారాన్ని కి చెరుకు సరఫరా చేసిన రైతులకు సంవత్సరాలు పై బడిన ఇంత వరకు పేమెంట్లు రైతులు ఇవ్వకపోవడం దుర్మార్గమని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసగించడం తగదని సీపీఐ నాయకులు అన్నారు.

Update: 2020-02-03 10:47 GMT

విశాఖపట్నం: అనకాపల్లి-తుమ్మపాల వి.వి.వి.రమణ సహకార చక్కెర కర్మాగారాన్ని కి చెరుకు సరఫరా చేసిన రైతులకు సంవత్సరాలు పై బడిన ఇంత వరకు పేమెంట్లు రైతులు ఇవ్వకపోవడం దుర్మార్గమని, కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసగించడం తగదని సీపీఐ నాయకులు అన్నారు. సోమవారం స్థానిక షుగర్ కేన్ అసిస్టెంట్ కమిషనర్ వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ పార్టీ నాయకులు వై.ఎన్. భద్రం మాట్లాడుతూ... అధికారులు, ప్రభుత్వం కలిసి రైతులకు పేమెంట్లు రేపు, ఎల్లుండి చేస్తామని కాలయాపన చేస్తున్నారని, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని పాలకులు చెబుతున్నప్పటికీ ఇంత వరకు ఒక్క పైసా కూడా రైతులకు పేమెంట్లు చేసింది లేదని, నిపుణుల కమిటీ వస్తున్నాయని తెలుపుతున్నారని రైతులు పేమెంట్లు చేయడానికి నిపుణుల కమిటీ ఏం చేస్తుందని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కోణతాల.హరినాద్ బాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కొరిబిల్లి.శంకరరావు, బొడ్డేడ.విరునాయుడు, కర్రి. సూర్యనారాయణ, కోన.లక్ష్మణ్, ఎం.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News