AP Corona Updates: ఏపీలో కొత్తగా 8,943 కరోనా కేసులు..

AP Corona Updates : ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,943 కరోనా కేసులు

Update: 2020-08-14 13:10 GMT
coronavirus (File Photo)

AP Corona Updates : ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,943 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కేసుల సంఖ్య 2,73,085 కి చేరుకుంది. ఇందులో 89,907 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 1,80,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా కరోనాతో మరో 97 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 2,475కి చేరుకుంది.

కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది, అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 6, విజయనగరం జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో చనిపోయారు.

ఇక ఇప్పటివరకూ రాష్ట్రంలో 27,58,485 కరోనా టెస్టులను నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.. ఇక జిల్లాల వారిగా కరోనా లెక్కలు చూసుకుంటే.. అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1146 కేసులు నమోదు అయ్యాయి.. అనంతపురంలో 762, చిత్తూరు లో 987, గుంటూరు 527, కడపలో 530, కృష్ణా జిల్లాలో 338, కర్నూలు జిల్లాలో 956, నెల్లూరు 669, ప్రకాశంలో 300, శ్రీకాకుళంలో 547, విశాఖపట్నంలో 885, విజయయనగరంలో 548, వెస్ట్ గోదావరి జిల్లాలో 748 కేసులు నమోదు అయ్యాయి..


 

Tags:    

Similar News