ఏపీలో కరోనా బారిన పడుతున్నది మధ్య వయస్కులే

ఏపీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు దడ పుట్టిస్తోంది.

Update: 2020-04-27 14:55 GMT
Representational Image

ఏపీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులు దడ పుట్టిస్తోంది. నాలుగు రోజులుగా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 1117కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం, అధికారుల్లో ఆందోళన పెరిగింది. 31 మంది మరణించారు. అయితే కరోనా పాజిటివ్ కేసుల ఎక్కువ శాతం యువతలో వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిచింది.

ఏపీలో ఎక్కువగా కరోనా బారిన పడుతున్నది యువకులేనని తేలింది. ఇప్పటివరకు గుర్తించిన కరోనా బాధితుల్లో 16 నుంచి 45 ఏళ్ల వయసు వారు 60.87 శాతం మంది ఉన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల శాతం కేవలం 11.12 మాత్రమే ఉంది.15 ఏళ్ల లోపు వారి శాతం 6.54 కాగా, 46 నుంచి 60 ఏళ్ల వ్యక్తుల శాతం 21.48గా ఉంది.

కర్నూలు 292, గుంటూరు 237, కృష్ణా 210 జిల్లాల్లో రెండొందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వరకు 6517 మంది పరీక్షలు నిర్వహించారు.ఇవాళ కర్నూలు లో 13, గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 235 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..31మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు.




Tags:    

Similar News