ఏపీలో ఇవాళ కొత్తగా 80 పాజిటివ్ కేసులు.. డబుల్ సెంచరీ దాటిన కృష్ణాజిల్లా
ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కి చేరింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వరకు 6517 మంది పరీక్షలు నిర్వహించారు.ఇవాళ కర్నూలు లో 13, గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 235 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..31మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు,
♦ గుంటూరు 237,
♦ కృష్ణా జిల్లాలో 210,
♦ విశాఖపట్నం 22 ,
♦ అనంతపురం 53,
♦ చిత్తూరు 73,
♦ నెల్లూరు 79,
♦ కడప 58,
♦ ప్రకాశం 56,
♦ తూర్పుగోదావరి 39,
♦ పశ్చిమగోదావరి 54,
♦ శ్రీకాకుళం 4,
విజయనగరం జిల్లా లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.