ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 147 కేసులు..

Update: 2020-06-09 12:54 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 216 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 15,085 శాంపిల్స్‌ని పరీక్షించగా 216 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 34 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు.. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 69 ఉండగా.. రాష్ట్రంలో 147 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు 2,403 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 1,510 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 77కు చేరింది.




 


Tags:    

Similar News