Corona Effect On AP Villages: నాలుగొందలు జనాభా... 34 పాజిటివ్ కేసులు

Corona Effect On AP Villages: నాతవరం మండలం ఏపీ పురంలో కరోనా విభృంభ‌న‌, పొలాల్లో నివాసముండేందుకు తరలివెళ్లిన సగం కుటుంబాలు

Update: 2020-07-30 02:06 GMT
corona effect

Corona Effect On AP Villages: విశాఖ జిల్లా, నాతవరం మండలం, ఏపీ పురం పంచాయతీలో కరోనా విజ్రుంభిస్తోంది. తుని - నర్సపట్నం రహదారిలో శరభవరం నుంచి కూత వేటు దూరంలో ఏలేరు కాలువను ఆనుకుని ఈ గ్రామం ఉంది. దీనినే సీహెచ్ భీ భీ అగ్రహారం, పాత నాయుడుపాలెం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ నాలుగు వందల మంది ప్రజలు నివశిస్తుంటారు. వీరికి కూరగాయలు ఇతర అవసరాలకు సమీపంలో ఉండే శరభవరం వెళుతుంటారు. గ్రామాన్ని అనుకుని విశాఖకు నీటిని సరఫరా చేసే ఏలేరు కాలువ ఉండటంతో చుట్టూ ఏడాది పొడవునా పచ్చగా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ కాలువ నుంచి వచ్చే ఊట నీరు వల్ల ఈ ప్రాంత ప్రజలు ఏడాదికి రెండు పంటలు పండిస్తుంటారు. అలాంటి పచ్చని వాతావరణంతో కళకళలాడుతూ ఆనందంగా గడిపేవారు. అలాంటి ఈ గ్రామంలో ఒక్కసారే కరోనా మహమ్మారి విలయంతో పరిస్థితి అంతా తారుమారయ్యింది.

ఈ నెల ప్రారంభంలో జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన నలుగురు యువకులు రావడంతో వైరస్ వ్యాప్తికి కారణమయ్యింది. వీరికి అధికారులు క్వారెంటైన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల, హౌస్ క్వారెంటైన్ లో ఉండమని చెప్పడంతోనే ఈ దుస్తితి వచ్చింది. వారు విచ్ఛలవిడిగా తిరడంతో పరిస్థితి అంతా తారుమారైంది. ఈ విధంగా జూలై 12న మొదటి పాజిటివ్ కేసు రాగా, తరువాత మూడు, నాలుగు రోజులకు రెండు, మూడు చొప్పున కేసులు నమోదవుతూ ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల గ్రామంలో ఒక్కసారే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో వేరే ఊరు పోదామన్నా, వారు రానివ్వకపోవడంతో సమీపంలో పొలాల్లో పశువుల పాకలు ఉన్నవారంతా ఉండే వారంతా అక్కడకు వెళ్ళి తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పాజిటివ్ తో ఆస్పత్రులకు వెళ్లిన వారంతా ఒక్కక్కరూ ఇంటికి వస్తుండటంతో కాస్త కుదుట పడ్డారు. పొలాల్లోకి వెళ్లిన కొంతమంది మరలా తిరిగి గ్రామంలోని స్వంత ఇళ్లకు చేరుకుంటున్నారు.

అయితే ఈ 20 రోజుల కాలంలో గ్రామస్తులు నరకయాతన చూశారు. ఇక్కడ ఒక్కసారే కేసులు పెరిగిపోవడంతో ఆందోళన చెందిన చుట్టు పక్కల గ్రామస్తులు తమ గ్రామంలోకి రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల కూరగాయలతో పాటు ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో పాటు ఇతరులు తమ పొలం పనుల్లోకి పిలవకపోవడమే కాకుండా, గ్రామస్తుల స్వంత భూముల్లో పనులు చేసుకునేందుకు వెళ్లే్ందుకు అడ్డు చెప్పిన సందర్భాలున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తుండటం వల్ల చుట్టుపక్కల వారంతా ఖరీఫ్ పనులు ముమ్మరం చేయగా, ఈ గ్రామస్తులు మాత్రం ఏమీ చేయలేక, ఏ పనుల్లేక ఖాళీగా ఉండిపోతున్నారు. ఈ విధమైన పరిస్థితుల వల్ల సమీప గ్రామాలు వెళ్లి కూరగాయలు, ఇంటికి అవసరమైన సరుకులు తెచ్చుకునేందుకు వీలు లేకపోవడం, ప్రభుత్వ అధికారులు కూరగాయలు, వంటకు అవసరమైన సరుకులు పంపిణీకి చర్యలు తీసుకోకపోవడం వల్ల గత 20 రోజులుగా గ్రామస్థులు అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు.

రాష్ట్రంలోనే గ్రామస్థాయిలో ఎక్కడాలేని విధంగా కేసులు నమోదైనా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేసుల పర్వం మొదలైన తరువాత బ్లీచింగు చల్లి, నామమాత్రంగా టెస్టుల కోసం రెండు, మూడు సార్లు వైద్య శిబిరం నిర్వహించారు..ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకుని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Tags:    

Similar News