Duvvada Srinivas - Divvela Madhuri: తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి
Duvvada Srinivas - Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ మరోసారి హల్చల్ చేశారు. ఏకంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడే వారి చేసిన ఓ పని ఇప్పుడు విదాస్పదంగా మారింది.
Duvvada Srinivas - Divvela Madhuri: తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి
Duvvada Srinivas - Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ మరోసారి హల్చల్ చేశారు. ఏకంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడే వారి చేసిన ఓ పని ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తమ సన్నిహితులతో కలిసి తిరుమలకు వచ్చారు. ఇద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వారిద్దరూ అక్కడ ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీళ్లు కొండపై ఏం చేశారనేది లోతుగా పరిశీలించిన క్రమంలో ఓ విషయం బయటపడింది. అదే వీరిద్దరిని వివాదంలోకి నెట్టేలా కనిపిస్తోంది.
తిరుమలకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఫొటోషూట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటివి కొండపై చేయడం నిషేధం. స్వామివారి సన్నిధిలో భక్తి మాత్రమే ఉండాలని ఎలాంటి పిచ్చిపనులు చేయకూడదు. కానీ వీరిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ ఫోటో షూట్ చేయించుకున్నారన్న వివాదం తెరపైకి వచ్చింది. దివ్వెల మాధురి తిరుమాఢ వీధుల్లో, పుష్కరిణి దగ్గర ఫొటోలు తీయించుకోవడం ఇప్పుడు చర్చకు కారణమైంది. ఇలాంటివి కొండపై చేయకూడదని చెప్పాల్సిన దువ్వాడ శ్రీనివాస్ తనే దగ్గరుండి మాధురిని ఫొటోలు తీయించారన్న టాక్ వినిపిస్తోంది.
ఇంతకుముందు కూడా కొంతమంది సెలబ్రిటీలు కొండపై ఫొటో షూట్లు చేయించుకుని చిక్కుల్లో పడ్డారు. ఈ జంటపై కూడా నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ అంశంపై టీటీడీ స్పందిస్తుందా..ఇలాంటివి చేయకూడదని సూచిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.