Manickam Tagore: ఏఐసీసీ స్ర్కీనింగ్ కమిటీ సూచనల మేరకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
Manickam Tagore: పోటీపై ఆసక్తి ఉన్న కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవచ్చు
Manickam Tagore: ఏఐసీసీ స్ర్కీనింగ్ కమిటీ సూచనల మేరకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
Manickam Tagore: కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకునే కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏఐసీసీ స్ర్కీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ త్వరలోనే ఏపీలో పర్యటిస్తుందని తెలిపారు ఠాగూర్. భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.