Sriharikota: శ్రీహరికోట షార్ లో కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు జవాన్ల ఆత్మహత్య
Sriharikota: తుపాకీతో కాల్పుకున్న సీఐఎస్ఎఫ్ ఎస్ఐ
Sriharikota: శ్రీహరికోట షార్ లో కలకలం.. 24 గంటల వ్యవధిలో ఇద్దరు జవాన్ల ఆత్మహత్య
Sriharikota: తిరుపతి జిల్లాలోశ్రీహరికోట షార్ 24 గంటల వ్యవధిలో ఇద్దరు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల సిబ్బంది ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకరు ఉరేసుకుని మరొకరు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 24గంటల వ్యవధిలోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో షార్లో అలజడిరేపింది. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చింతామణి రాడార్ సెంటర్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. చింతామణి ఈనెల 10న విధుల్లోకి చేరాడు. ఈ సంఘటన నుంచి తేరుకోక ముందే సీఐఎస్ఎఫ్ ఎస్ఐ వికాస్ సింగ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒకే రోజు రెండు సంఘటనలు జరగడంతో సీఐఎస్ఎఫ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.