ఏపీలో డీశాలినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కమిటీ

Update: 2021-02-16 11:55 GMT

ఏపీలో డీశాలినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కమిటీ

ఏపీలో డీశాలినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌ ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణపట్నం లేదా మరో అనువైన ప్రాంతంలో ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకునేలా ఈ కమిటీ పరిశీలన జరపనుంది.

సముద్రపు నీటిని శుద్ధి చేయడమే డీశాలినేషన్‌. ఈ పద్ధతి ద్వారా ఉప్పు నీటిని మంచినీరుగా మారుస్తారు. ఈ నీటిని పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు భూగర్భ జలాలను వాడుకోకుండా పూర్తిగా సముద్రపు నీటిని వాడుకునే విధంగా పరిశ్రమల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. డీశాలినేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారు 70కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా.

Tags:    

Similar News