ప్రత్యేక హోదా తప్పక వస్తుంది: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-05-28 08:15 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండిన నేపథ్యంలో నాలుగోరోజు వైసీపీ మేధోమథనం సదస్సు 'మన పాలన-మీ సూచన' పేరుతో సీఎం ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. సదస్సులో 'మన పాలన-మీ సూచన' అంశంపై సీఎం జగన్ మాట్లాడారు. అవినీతి రహిత పాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం జగన్ అన్నారు. మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం మెరుగ్గా ఉందని, రాష్ట్రంపై కేంద్రం ఆధారపడే రోజులు వస్తాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా ఇవాళ కాకపోతే రేపు తప్పక వస్తుంది..కానీ, హోదా అడగడం మానుకోకూడదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహకాలు వచ్చేవన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలో ఉందని, 22 మంది ఎంపీలతో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయిందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో ఇప్పటికే ప్రజాధనం చాలా వరకు ఆదా చేశామని సీఎం వివరించారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News