ఆ రుణాల వాయిదా చెల్లింపులపై 12 నెలలు మారటోరియం ప్రకటించాలి : సీఎం జగన్

ప్రధాని నరేంద్ర మోదికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.

Update: 2020-05-01 03:20 GMT
YS Jaganmohan Reddy, PM Modi

ప్రధాని నరేంద్ర మోదికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం పూర్తిగా స్థంబించిందని.. దీనిని ఆదుకోవడానికి సాయం చెయ్యాలని జగన్ కోరారు.. పరిశ్రమల్లో భారీ ఎత్తున ఉత్పత్తి నిలిచిపోయిందని, ఇతర ప్రాంతాలకు రవాణా, ఎగుమతులు లేవని పేర్కొన్నారు..

లాక్ డౌన్ కారణంగా కార్మికులు పనులకు రాకపోవడంతో ఉత్పత్తిరంగం స్థంబించిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చెల్లింపులపై ఆరు నెలలు ఎంప్లాయర్ కి మారటోరియం విధించాలి. ఎంఎస్ఎంఈ ల తీసుకున్న అన్ని రుణాల వాయిదా చెల్లింపులపై 12 నెలలు మారటోరియం ప్రకటించాలి. అని కూడా ముఖ్యమంత్రి లేఖలో ప్రస్తావించారు.

 

Tags:    

Similar News