కరోనాతో ఇబ్బందులు తప్పవు.. నాకు కూడా రావొచ్చు.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఎప్పుడూ ఉండదని సీఎం జగన్ అన్నారు.

Update: 2020-04-27 13:19 GMT
YS Jaganmohan Reddy(File photo)

కరోనా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు ఎప్పుడూ ఉండదని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రాంతాలు పూర్తికి గ్రీన్ జోన్ లోనే ఉందని సీఎం తెలిపారు. ఏపీలో కరోనా టెస్టింగ్ సామర్థ్యం పెంచుతున్నమని సీఎం తెలిపారు. ఇప్పటవరకూ 74,551 టెస్టుల నిర్వహించినట్లు వెల్లడించారు. టెస్టింగ్ సామర్థ్యం మరింత పెంచనునట్లు తెలిపారు. కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని సీఎం జగన్ అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మీడియా తో మాట్లాడుతూ..కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చు. రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అన్నారు. ఎవరికి వస్తుందో తెలియటం కష్టం. సామాజిక దూరం పాటించడం అవసరం. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ ప్రాంతాలలో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. దేశం మొత్తంమీద సగటున పది లక్షల జనాభాలో 451 నిర్వహిస్తున్నామని జగన్ చెప్పారు. ఏపీలో సగటున ఒక 1396 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి రోగ నిరోధకశక్తిని పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మాస్కూల్ అందిస్తున్నాం, మనిషికి 3 మాస్కులు అందిస్తున్నామని సీఎం తెలిపారు. కరోనా సోకినట్లు 80 శాతం మందికి తెలియదన్నారు. ఇంట్లో ఉంటేనే కరోనా నయం అవుతుందని, 14 శాతం మంది మాత్రమే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది అన్నారు. కరోనా టెస్టుల్లో 1.61 శాతం పాజిటివ్ కేసులు ఉన్నాయని సీఎం జగన్ వెల్లడించారు.

ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కి చేరింది.గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కర్నూలు లో 13, గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 235 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..31మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు.

జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237, కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదువిశాఖపట్నం 22 , అనంతపురం 53, చిత్తూరు 73, నెల్లూరు 79 కడప 58, ప్రకాశం 56, తూర్పుగోదావరి 39, పశ్చిమగోదావరి 54, శ్రీకాకుళం 4, విజయనగరం జిల్లా లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు 

Tags:    

Similar News